శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (15:13 IST)

హీరో సూర్యకు కమల్ హాసన్ ఖరీదైన రోలెక్స్ వాచ్ గిఫ్టు

rolex watch
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన కొత్త చిత్రం "విక్రమ్". యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3వ తేదీన విడుదలవుతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్  రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఒక్క తమిళంలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో మంచి కలెక్షన్లు రాబడుతుంది. పైగా, అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి ఐదు చిత్రాల్లో విక్రమ‌ చోటు దక్కించుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇంతటి సక్సెస్‌కు కారణమైన వారికి హీరో కమల్ ప్రత్యేకమైన బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు ఖరీదైన లగ్జరీ కారును అందజేశారు. అలాగే, ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్‌కు కోడైరెక్టర్లుగా పని చేసిన 13 మందికి మోటార్ బైకులు ఇచ్చారు. 
 
ఇపుడు ఈ చిత్రంలో ప్రత్యేకంగా అతిథి పాత్రలో నటించిన హీరో సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో హీరో సూర్య క్రూరమైన మాఫియా డాన్‌గా "రోలెక్స్" అనే పాత్రలో నటించిన విషయం తెల్సిందే. అందుకే రోలెక్స్ వాచ్‌ను సూర్యకు గిఫ్టుగా ఇచ్చారు.