శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (08:50 IST)

కంగనా రనౌత్‌ను మహారాష్ట్ర సర్కారు టార్గెట్ చేసిందా?

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ను మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం టార్గెట్ చేసిందా? అనే అంశంపై ఇపుడు పెద్ద చర్చే సాగుతోంది. ఈ విషయంలో నెటిజన్లు కంగనా రనౌత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 
 
మహారాష్ట్ర ప్రభుత్వం తనను కావాలనే టార్గెట్ చేసిందని కంగనా రనౌత్ తాజాగా ఆరోపించారు. తన పాస్ పోర్ట్ విషయంలో ప్రభుత్వం పరోక్షంగా వేధింపులకు గురిచేస్తుందన్నారు. అసలు ఎవరో తెలియని వ్యక్తి పెట్టిన ఒక తప్పుడు కేసు కారణంగా చూపించి పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి అధికారులు తిరస్కరిస్తున్నారు అంటూ ఆమె మండిపడుతోంది. 
 
ఇదే విషయంపై కోర్టును ఆశ్రయిస్తే... అక్కడ కూడా తనకు అన్యాయం జరిగిందని.. అప్లికేషన్ అస్పష్టంగా ఉంది అంటూ జూన్ 25కి విచారణ వాయిదా వేసిందని ఆమె వాపోయారు. గతంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. ఎందుకు ఆయన పాస్‌పోర్ట్‌ రెన్యువల్ ఆపలేదని.. షూటింగ్ ఎందుకు నిలిపి వేయలేదని ఆమె ప్రశ్నించింది. 
 
తన విషయంలో మాత్రమే ఎందుకు ఇలా కక్ష సాధిస్తున్నారు.. ఇలా వేధిస్తున్నారు అంటూ ఆమె మండిపడుతుంది. ప్రస్తుతం ఈమె తేజస్ సినిమా కోసం బుడాపెస్ట్ కు వెళ్లాల్సి ఉంది. కానీ పాస్ పోర్ట్ రెన్యువల్ ఆగిపోవడంతో షూటింగ్ కూడా ఆలస్యం అవుతుంది.