ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మే 2024 (20:11 IST)

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. రాజకీయాల్లో వున్నా.. సినిమాలకు దూరమయ్యే అవకాశం లేదని.. కంగనా రనౌత్ అంటున్నారు. ఎన్నికల అనంతరం తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టబోనని ఆమె స్పష్టత ఇచ్చారు. 
 
అయితే కంగనా చేసిన తాజా వ్యాఖ్యలు మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో కొనసాగాలనే ఆమె నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలున్నాయి. కాగా కంగనా రనౌత్ చివరిగా తేజస్ సినిమాలో కనిపించింది. మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి. 
 
కాగా మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఆ స్థానంలో వ్యూహాత్మకంగా కంగనా రనౌత్‌ని బీజేపీ రంగంలోకి దింపింది. జూన్ 1న 4 లోక్‌సభ స్థానాలతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో ఆ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.