గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (22:44 IST)

కంగనా రనౌత్‌తో మిస్టరీ మ్యాన్‌- అతడిని పెళ్లి చేసుకోబోతుందా..?

Kangana Ranaut
Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా పెళ్లి ఎప్పుడు? ఆమె ప్రియుడు ఎవరు? ఎన్నో వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ ఫైర్ బ్రాండ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ మిస్టరీ మ్యాన్‌తో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. కంగనా ఓ యువకుడు చేతులు పట్టుకుని సెలూన్ నుంచి బయటకు వెళ్తున్న ఫోటో వైరల్‌గా మారింది. కంగనా అతడిని పెళ్లి చేసుకోబోతుందా.? అని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 
Kangana Ranaut
Kangana Ranaut
 
కొంతమంది నెటిజన్లు ఆ వ్యక్తిని నటుడు హృతిక్ రోషన్‌లా ఉన్నదంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది అంటే 2023లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కంగనా పెళ్లి గురించి మాట్లాడింది. కంగనా కూడా పెళ్లి చేసుకుని కుటుంబంతో గడపాలని ఉందని తెలిపింది. కంగనా ప్రస్తుతం తన కొత్త చిత్రం ఎమర్జెన్సీతో బిజీగా ఉంది.