నవగ్రహ ఫేమ్ కన్నడ నటుడు గిరి దినేష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి
నవగ్రహ అనే కన్నడ సినిమాలో శెట్టి పాత్రకు పేరుగాంచిన కన్నడ నటుడు గిరి దినేష్ గుండెపోటుతో మరణించారు. ప్రముఖ నటుడు దినేష్ కుమారుడు, సాయంత్రం ప్రార్థనల సమయంలో ఇంట్లో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడికి చేరుకునేలోపే ఆయన మరణించినట్లు ప్రకటించారు వైద్యులు. ఆయన ఆకస్మిక మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
కన్నడ సూపర్ స్టార్ దర్శన్ సోదరుడు దినకర్ తూగుదీప దర్శకత్వం వహించిన 2008 చిత్రం నవగ్రహలో శెట్టి పాత్రను పోషించడం ద్వారా గిరి దినేష్ కీర్తికి ఎదిగాడు. బారే నాన్న ముద్దిన రాణితో బాల నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇక గిరి దినేశ్ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సహచరులు, అభిమానులు గిరి దినేశ్‌కు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.