ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (20:26 IST)

బుధ, గురు, శుక్ర గ్రహాల మార్పు.. కన్యారాశితో పాటు ఆ రాశులకు..?

Virgo
గురు, శుక్ర, బుధ గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. ఈ నెల 11న గురువు వక్రించడం, బుధుడు తులా రాశిలో ప్రవేశించడం జరుగుతుండగా, 13న శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. 
 
ఈ మూడు గ్రహాల మార్పు కారణంగా వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ముందుగా వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభం జరుగుతుంది. 
 
అలాగే కర్కాటక రాశి వారికి మూడు శుభ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల అష్టమ శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయి, అనేక కష్టనష్టాల నుంచి బయటపతారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. 
 
కన్య రాశికి చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. తులా రాశికి ఈ మూడు శుభ గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. లాభాలకు లోటుండదు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. 
 
వృశ్చికరాశి వారికి రావలసిన డబ్బు, రాదనుకున్న సొమ్ము కూడా చేతికి అందుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు.
 
మకర రాశికి ఈ మూడు శుభ గ్రహాలతో పాటు శని, రాహువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందున వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయానికి ఇబ్బంది వుండదు. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి.