శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: బుధవారం, 15 జులై 2020 (17:08 IST)

సామాజిక సేవకుడిగా నటుడు సుదీప్, ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నాడు

ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క సామాజిక సేవలో నిమగ్నమయ్యారు నటుడు సుదీప్. కొందరు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కరోనా సమయంలో పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన విషయం విదితమే. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయనిధికి కోట్ల రూపంలో విరాళాలు ఇచ్చిన విషయం వాస్తవమే.
 
కొందరు సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలాంటివారిలో మహేష్ బాబు ఉన్నారు. ఇప్పుడు కన్నడ హీరో కిచ్చా సుదీప్ కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. 
 
ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంకోసం పలు సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అందుకోసం ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచారు.