శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (11:55 IST)

నిర్మాత సురేష్‌పై అవంతిక కేసు: పెర్మాఫ్మెన్స్ బాగా లేదని వేధిస్తున్నారు-చెక్ బౌన్స్‌పై అడిగితే..?

కన్నడ నటి, అవంతిక నిర్మాత సురేష్‌‍పై చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన గురించి అవాస్తవాలను పత్రికలో నిర్మాత సురేష్ రాయించాడని, తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఉండటంతో ఆందోళన చెంద

కన్నడ నటి, అవంతిక నిర్మాత సురేష్‌‍పై చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన గురించి అవాస్తవాలను పత్రికలో నిర్మాత సురేష్ రాయించాడని, తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఉండటంతో ఆందోళన చెందాల్సివచ్చిందని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. తన కెరీర్‌కు భంగం కలిగించేలా నిర్మాత వ్యవహరించాడని పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి వేధిస్తున్నారని తెలుసుకుని సహనంతో వ్యవహరిస్తూ వచ్చానని తెలిపింది.
 
'రాజు కన్నడ మీడియం' తొలి షెడ్యూల్ నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయని, మంచి నటనను ఇచ్చేందుకు కష్టపడ్డానని, బ్యాంకాక్‌లో తనతో దారుణంగా ప్రవర్తించారని తెలిపింది. చెక్కులు ఎందుకు బౌన్స్ అయ్యాయని నిలదీయడంతో తనను ముంబైకి పంపించారని చెప్పింది. ఇప్పటిదాకా చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదన్నారు. చేసిన మోసంపై కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపింది.