శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (18:24 IST)

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

Yash
Yash
బెంగళూరులో సూపర్‌స్టార్‌ యష్ నటించిన "టాక్సిక్" సినిమా షూటింగ్‌ కోసం వందలాది చెట్లను నరికిన ఘటనపై కర్ణాటక అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నుంచి సమ్మతి పొందిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హెచ్ఎంటీ జనరల్ మేనేజర్‌లను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నారు.
 
టాక్సిక్ సినిమా షూటింగ్ కోసం బెంగళూరులోని హెచ్‌ఎంటీకి చెందిన భూమిలో చెట్ల నరికివేతకు సంబంధించి చర్యలు తీసుకుంటామని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గతంలో ప్రకటించారు. ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణ కోసం హెచ్‌ఎంటీ ఆధీనంలోని అటవీ భూమిలో అక్రమంగా వందలాది చెట్లను నరికివేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని మంత్రి ఖండ్రే అన్నారు. 
 
ఈ చట్టవిరుద్ధమైన చర్యను శాటిలైట్ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. "నేను ఈ రోజు తనిఖీ కోసం సైట్‌ను సందర్శించాను. ఈ నేరానికి బాధ్యులైన వారిపై తక్షణం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను ఆదేశించాను" అని ఖండ్రే చెప్పారు. సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించానని.. ఏరియల్ సర్వే చిత్రాలు కూడా నిర్ధారించాయని వెల్లడించారు. అటవీ చట్టం 24 ప్రకారం కేసు నమోదు చేయడానికి నిబంధన ఉందని చెప్పుకొచ్చారు.