సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (19:50 IST)

పసుపు చీరతో షర్మిల ఆకర్షించిందా.. విజయసాయికి బుద్ధుందా?: బుద్ధా వెంకన్న

Sharmila_Babu
Sharmila_Babu
ఏపీలో టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బుద్ధా వెంకన్న వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2027లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని విజయసాయిరెడ్డి కలలు గంటున్నారని బుద్దా విమర్శించారు. 
 
జమిలి ఎన్నికలపై ఇంకా చట్టం చేయలేదని, పార్లమెంట్‌లో బిల్లు పాస్ కావాలని గుర్తుచేశారు. జగన్ ఇక్కడ అధికారంలోకి రాడు, కలలు కనడం మానుకో అన్నారు. షర్మిల చీర గురించి మాట్లాడిన విజయ సాయిని ఇంకా పార్టీలో ఉంచిన వైసీపీ నాయకులకు బుద్ది ఉండాలన్నారు.
 
షర్మిల తన కొడుకు పెళ్లికి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వెళితే.. పసుపు చీర కట్టుకుని ఆకర్షించిందని ఈ చిత్తకార్తి కుక్క విజయసాయి వాగారు. "ఆకర్షించడం అంటే అసలు ఎన్ని అర్ధాలు వస్తాయో నీకు తెలుసారా చిత్తకార్తి కుక్కా. వైఎస్ దయతో ఎదిగిన నువ్వు.. అదే వైఎస్ బిడ్డపై నీచంగా మాట్లాడతావా. వైసీపీ నేతలు, అభిమానులకు రోషం, పౌరుషం ఉందా. విజయసాయిరెడ్డి అనే చిత్తకార్తి కుక్కకు బుద్ది చెప్పే ధైర్యం మీకు లేదా. రెండు చెంపలు పగులకొట్టకుండా.. ఇంకా పార్టీలో ఉంచుకుని.. పెత్తనం ఇస్తారా...?" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న విజయసాయిరెడ్డి.. "నీకు సిగ్గు, శరం ఉందా. 16 నెలలు జైలులో ఉన్న విజయసాయిరెడ్డి.. మళ్లీ అవినీతిపై మరోసారి జైలుకు వెళ్లడం ఖాయం" బుద్ధా వెంకన్న అని స్పష్టం చేశారు.