వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల అభ్యర్థుల 9వ జాబితాను విడుదల చేసింది. తాజాగా వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించింది. విజయసాయిరెడ్డి ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
నెల్లూరు లోక్‌సభ పార్లమెంటరీ నియోజకవర్గానికి సమన్వయకర్తగా తనను నియమించినందుకు వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
"నెల్లూరు లోక్‌సభ పార్లమెంటరీ నియోజకవర్గానికి నన్ను సమన్వయకర్తగా నియమించినందుకు గౌరవనీయులైన సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పటిలాగే పార్టీ కోసం నిబద్ధత, అంకితభావంతో పని చేస్తాను" అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఇకపోతే.. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ను ప్రకటించారు. ఇంతియాజ్ వైకాపాలో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవి స్థానంలో మురుగు లావణ్య నియమితులయ్యారు.