సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (14:32 IST)

గుడ్ న్యూస్: తల్లిదండ్రులు కానున్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి

KL Rahul
KL Rahul
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గుడ్ న్యూస్ చెప్పారు.  త్వరలో కుటుంబంలోకి కొత్త అతిథిని స్వాగతించనున్నట్లు ప్రకటించారు. ప్రన్తుతం అతియా శెట్టి గర్భంతో ఉంది. త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు రాహుల్ దంపతులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 
 
2025లో పుట్టబోయే బిడ్డపై భగవంతుడి ఆశీస్సులు ఉండాంటూ ఈ పోస్టులో తెలిపారు కేఎల్ రాహుల్- అతియా. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జనవరి 23న సునీల్ శెట్టి చేతుల మీదుగా ముంబయిలోని ఫామ్‌హౌస్‌లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.