కింగ్ కోహ్లీ అద్భుత రికార్డు.. పంజాబ్‌పై 1000 పరుగులు పూర్తి
పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్‌సీబీ విజయంలో మెరుపు ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లోనే కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు సాధించాడు.
దీంతో ఈ క్రమంలో పంజాబ్‌పై విరాట్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే ఈ ఫీట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లపై నమోదు చేసిన కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మూడు ఐపీఎల్ జట్లపై 1000 పరుగుల మార్క్ అందుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.
అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 12 మ్యాచులాడాడు. రన్ మెషీన్ 70.44 సగటు, 153.51 స్ట్రైక్ రేటుతో 634 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తం 30 సిక్సర్లు, 55 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ తన వద్దే ఉంచుకున్నాడు.