మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (13:13 IST)

ఐపీఎల్ 17వ సీజన్‌.. ఇద్దరు కెప్టెన్లకు ఒకేసారి షాక్.. ఎందుకు?

KL Rahul, Ruturaj Gaikwad
KL Rahul, Ruturaj Gaikwad
ఐపీఎల్ 17వ సీజన్‌లో క్రికెట్ స్కోర్లకు సంబంధించిన రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ సీజన్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లకు జరిమానా విధించారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు సారథులకు ఫైన్ వేయడం ఇదే ప్రథమం. లక్నో వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఇది జరిగింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, లక్నో సారథి కేఎల్ రాహుల్‌కు రూ.12 లక్షల చొప్పున జరిమానా వేశారు. 
 
''లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు చెరో రూ. 12 లక్షల జరిమానా విధించారు'' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సొంతమైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.