1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (11:40 IST)

శ్రీకృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి... బృందావనంలోనే..?

Gwalior Girl Marries Lord Krishna
Gwalior Girl Marries Lord Krishna
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన శివాని పరిహార్ అనే యువతి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధించేంది. దీంతో కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. తన తల్లిదండ్రులను అందుకు ఒప్పించింది. తాజాగా బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది. అనంతరం అప్పగింతలు కార్యక్రమం కూడా నిర్వహించారు. 
 
ఇక నుంచి ఆమె కృష్ణుడి సేవలోనే ఉండనుంది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివాసం వుంటున్న శివాని పరిహార చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి పట్ల అమితమైన భక్తి, ప్రేమను కలిగివుంది. 
 
ఈ నేపథ్యంలో స్థానిక ఆలయంలో వేద మంత్రాల సాక్షిగా ఆమె కృష్ణుడిని వివాహం చేసుకుంది. ఇక వివాహం ముగిసిన తర్వాత శివానికి వివాహ ప్రమాణం కూడా అధికారులు అందజేశారు. 
 
శివాని పట్టుదల కారణంగా ఆమె పెళ్లికి అంగీకరించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఇక శివాని తన పూర్తి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తూ గడపనుంది.