సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2024 (12:55 IST)

పిఠాపురంలో పవన్ గెలుపు కోసం హైపర్ ఆది పల్లెల్లో పర్యటన - video

Hyper Adi
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది పర్యటిస్తున్నారు. జనసేన ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జబర్దస్త్ నటుడు శ్రీ హైపర్ ఆది గారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని అభివృద్ధి కొరకు ఆయనకు అండగా నిలబడాలని, గాజు గ్లాసుకి ఓటు వేయాలని కోరారు.
 
పవన్ కల్యాణ్ మత్య్సకారులకు, కౌలు రైతులకు సొంత నిధులను వెచ్చించి ఆదుకున్నారనీ, ఆయనలోని సేవాగుణం చూసి ఆయనకు తను అభిమానినయ్యానంటూ చెప్పారు హైపర్ ఆది. మచ్చలేని నాయకుడు అయినటువంటి పవన్ కల్యాణ్ ను గెలిపించాలనీ, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలని విజ్ఞప్తి చేసారు. మరోవైపు మరో నటుడు పృధ్వీరాజ్ సైతం జనసేన గెలుపు కోసం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.