మంగళవారం, 14 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (22:29 IST)

10-11-2024 నుంచి 16-11-2024 వరకు మీ వార ఫలితాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఇతరులు విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. సోమ, మంగళవారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆప్తుల రాక సంతోషాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అంతర్యం గ్రహించండి. మీ సాయంతో ఒకరికి ప్రయోజనకం కలుగుతుంది. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
స్నేహసంబంధాలు బలపడతాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. మీ నమ్మకం, కృషి ఫలిస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై శ్రద్ధపెట్టండి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. కీలక పత్రాలు జాగ్రత్త. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఎదుటివారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానం కృషి ఫలిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వేడుకలు, వనసమారాధనల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సర్వత్రా అనుకూలతలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. దళారులను ఆశ్రయించవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గురు, శుక్రవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు నిదానంగా పుంజుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి శుభఫలితాలున్నాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ప్రలోభాలకు లొంగవద్దు. విదేల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం విదేశీ పర్యటన యత్నాలు ఫలిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. రిప్రజెంటేటివ్లు టార్గెట్లను అధిగమిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకోవటానికి శ్రమించండి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. ఎవరినీ నొప్పించవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలుఎ చేపడతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు బాధ్యతల మార్పు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఈ వారం విశేష ఫలితాలున్నాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. పొగిడే వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధువులను సంతోషపరుస్తుంది. పరిశ్రమల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. చిన్నవ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వేడుకలు, వనసమారాధనల్లో పాల్గొంటారు.