శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (14:58 IST)

సంక్రాంతికి షాక్.. రష్మిక ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..

ఛలో సినిమాతో 2016లో సినీ రంగంలోకి ప్రవేశించిన రష్మిక... 2019 కల్లా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె సంపాదనకు, ఆమె కడుతున్న పన్నుకు పోలిక లేకపోవడంతో సంక్రాంతి వేళ హీరోయిన్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు జరిపారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హిట్ కొట్టిన రష్మిక ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేట్‌లోని రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు ఈ సోదాలు చేశారు.
 
దాదాపు 10 మందికి పైగా ఐటీ అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారంతా రష్మిక ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదారాబాద్‌లో ఉన్న రష్మిక.. ఓ తమిళ్ సినిమా షూటింగ్ నిమత్తం చైన్నై వెళ్తున్నారు. ఈ ఐటీ దాడుల గురించి తనకేం తెలియదని రష్మిక అంటున్నారు. కానీ, ఆమె మేనేజర్ మాత్రం దాడులు జరిగిన మాట నిజమేనన్నారు.