గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (19:54 IST)

కార్తీక దీపం మోనిత లేటెస్ట్ ఫోటోలు అదుర్స్

కార్తీక దీపం సీరియల్‌తో మోనితగా శోభాశెట్టిని అందరికీ తెలుసు. కార్తీక దీపం సీరియల్లో మోనితగా అనితర సాధ్యమైన పర్ఫామెన్స్, విలనిజంతో అందరినీ భయపెట్టేసింది. 
 
మోనిత పాత్ర మీద అందరికీ ద్వేషం కలిగించే రేంజులో నటించేసి మెప్పించింది. అలా మోనితగా శోభా శెట్టికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే కన్నడలో మాత్రం శోభా శెట్టికి పలు సీరియళ్ల ఆఫర్లు వచ్చాయి.
 
అయినా తెలుగు సీరియల్స్ మీదే ఆమె ఫోకస్ పెట్టేసింది. కార్తీక దీపం సీరియల్‌లో ప్రస్తుతం మోనిత, డాక్టర్ బాబు, వంటలక్కల చుట్టూ కథ తిరుగుతోంది. 
 
దీంతో మోనిత మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో మోనిత కాస్త సోషల్ మీడియాలోనూ డోసు పెంచేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.