శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (13:22 IST)

కార్తికేయ, నేహా శెట్టి చిత్రం బెదురులంక 2012 ఫస్ట్ లుక్

Karthikeya Gummakonda
Karthikeya Gummakonda
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫొటో' నిర్మించిన బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది.
 
నాచురల్ స్టార్ నాని ఈ రోజు 'బెదురులంక 2012' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో, ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. వినూత్నంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.    
 
ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మోషన్ పోస్టర్ చూస్తే 'బెదురులంక 2012' ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. 'డీజే టిల్లు' తర్వాత నేహా నటిస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. కెమెరా వర్క్ సూపర్ అంటారంతా! ఆర్ట్ వర్క్ కూడా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి. థియేటర్లలో ప్రేక్షకులను 'బెదురులంక' అనే కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళ్తుంది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చెప్పారు.
  
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది" అని చెప్పారు.  
 
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.
 
ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.