బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (13:14 IST)

పవన్ ఫ్యాన్స్‌తో కత్తి మహేష్ సెల్పీలు... స్వీట్లు కూడా తినిపించుకున్నారు

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత స్వీట్లు కూడా తినిపించుకున్నారు. కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ ఫ్యాన్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీంత

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత స్వీట్లు కూడా తినిపించుకున్నారు. కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ ఫ్యాన్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీంతో కత్తి మహేష్ వెనక్కి తగ్గారు. ఫలితంగా వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. 
 
కొంతకాలంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమానులు, సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ల మధ్య సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇది కాస్త ముదిరి కత్తిపై పవన్ అభిమానులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీనిపై ఆగ్రహించిన కత్తి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంలో కొందరు జనసేన నాయకులు రంగంలోకి దిగారు. మహేష్‌తో చర్చలు జరిపారు. మహేష్‌‌పై దాడి చేసిన వారు ముందుకు వచ్చి క్షమాపణ కోరారు. దీంతో కత్తి వెనక్కు తగ్గారు. మాధాపూర్ పీఎస్‌లో ఇచ్చిన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, కత్తి మహేష్‌తో కలిసి స్వీట్లు పంచుకుని, వివాదం సమసిపోయినట్లేనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా కత్తితో పవన్ అభిమానులు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇకపై కత్తి మహేష్‌కు తమకు ఎలాంటి గొడవలు ఉండబోవని ప్రకటించారు.