సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (09:58 IST)

కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి..

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ కొండాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు. ఓ టీవీ చానెల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ కొండాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు. ఓ టీవీ చానెల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. 
 
గత కొన్ని రోజులుగా కత్తి మహేష్‌కు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, పవన్ ఫ్యాన్స్ పేరిట తనను కొందరు వేధింపుల పాలు చేస్తున్నారు. ఈ కోవలోనే కోడిగుడ్ల దాడి కూడా జరిగివుంటుందని భావిస్తున్నారు. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందిస్తూ, తనను వేధిస్తున్న వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కొండాపూర్‌లో కారు దిగిన తనపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు.