శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 మే 2016 (14:30 IST)

గుడ్‌విల్ అంబాసిడర్‌ ఇష్యూ: సల్మాన్ ఖాన్‌‍పై కత్రీనా కైఫ్ ఏమంది? కోహ్లీ ఏమన్నాడో తెలుసా?

బ్రెజిల్‌లోని రియో డి జెనిరియాలో జరిగే ఒలింపిక్స్‌కు భారత్ జట్టుకు గుడ్ విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంపిక తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై అందాల ముద్దుగుమ్మ, బాలీవుడ్ పొడవు కాళ్ల సుందరి కత్రీనా కైఫ్ స్పందించింది. భజరంగీ భాయ్‌జాన్ హీరోకు వివాదాలేమీ కొత్త కాదంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.  
 
సల్మాన్ ఖాన్ ఎంపికపై ఇప్పటికే ప్రముఖ బాలీవడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం విజేత యోగేశ్వర్ దత్, మిల్కాసింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
రియో ఒలింపిక్స్ గుడ్ విల్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై కోహ్లీ విచిత్రంగా స్పందించాడు. తాను ఈ నిర్ణయానికి అనుకూలమో, వ్యతిరేకమో చెప్పడం లేదన్నాడు. ఈ విషయంలో తన అభిప్రాయంతో ఎలాంటి ఉపయోగం ఉండదని.. నిజాయితీగా చెప్పాలంటే.. తాను ఈ విషయంపై ఏం మాట్లాడినా అది వార్తలకు మాసాలా అందినట్టే అవుతుందన్నాడు.