పవన్ కల్యాణ్‌తో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు జాగింగ్ వెళ్లేవాడిని: కౌశల్ (video)
బిగ్ బాస్ హౌస్‌లో తాను ఫాలో అయ్యింది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి ఆటిట్యూడ్‌నేనని కౌశల్ తెలిపాడు. బిగ్‌బాస్‌లో తన ప్రవర్తన, నడత అన్నీ పవన్‌ను ఫాలో అయినందువల్లేనని, ఎందుకంటే పవన్‌కు తాను ఓ పెద్ద భక్తుడిని అని కౌశల్ చెప్పాడు.
తమ్ముడు, ఖుషి, బద్రి నుంచే ఆయనతో ట్రావెల్ చేశానని కౌశల్ వెల్లడించాడు. ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు పవర్ స్టార్‌తో కలిసి జాగింగ్ వెళ్లే వాడినని, బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ టేబుల్ ముందు తన పేపర్ వుంటుందని కౌశల్ వెల్లడించాడు.
పవన్ కల్యాణ్ గారిని బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత కలవాలనుకున్నానని.. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేశానని.. పవన్ అంటే తనకు పిచ్చి అని కౌశల్ చెప్పాడు. మీ ఆటిట్యూడ్‌తో బిగ్ బాస్ హౌస్‌లో గెలిచానని చెప్పుకోవడం కోసం ఆయనకు లేఖ కలవాలని లెటర్స్ రాశానని కౌశల్ తెలిపాడు. అలాంటి పవన్ కల్యాణ్‌పై తానెందుకు విమర్శలు చేస్తానని ప్రశ్నించాడు.
అలాంటిది పవన్‌ను తానెలా పోటుగాడు అంటానని అడిగాడు. ఓ టీవీ ఛానెల్ తనకు వ్యతిరేకంగా లేనిపోని విమర్శలు చేస్తుందని కౌశల్ ఫైర్ అయ్యాడు. రాజకీయాల గురించి ఏదో కామెడీగా మాట్లాడానే కానీ తాను పార్టీ పెడతానని ఎక్కడా చెప్పలేదని కౌశల్ స్పష్టం చేశాడు.