శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (20:07 IST)

కెసిఆర్, ప‌ద్యాలు పాడి బహుమతులు గెలుచుకున్నాడు, తెలియాలంటే..!

KCR, Documentary still
బంధూక్‌ చిత్రంతో  క్రిటికల్ గా మన్నలను పొందిన దర్శకులు లక్ష్మణ్ మురారి, కెసిఆర్ గారి 67 వ పుట్టిన రోజును పురస్కరించుకుని KCR- నువ్వే ఒక చరిత్ర అనే డాక్యుమెంటరి సినిమాను విడుదల చేస్తున్నారు, ఈనెల 17వ తేదీ కెసిఆర్ పుట్టిన‌రోజు.
 
తెలంగాణ బ్రీత్ లేస్ సాంగ్, 18 మంది మేటి గాయకులతో వీరాది వీరుడు పాట, ఇలా ఎప్పుడు ప్రయోగాలను ఛాలెంజ్ గా తీసుకునే దర్శకులు లక్ష్మన్, ఈ KCR- నువ్వే ఒక చరిత్ర అనే సినిమా లో 1964-68 దశకం నాటి కెసిఆర్ గారు చదివిన దుబ్బాక Govt school ను 3D విజువల్ ఎఫెక్ట్స్ లో రి క్రియేట్ చేసారు, స్కూల్ లో చదువుతున్నప్పుడు కెసిఆర్ గారు పాడిన పాటను అచ్చం అప్పుడు 1964 పాడినట్లుగా,  బహుమతి గెలుచుకున్న బాలుడు కేసిఆర్ గారిని 3D విజువల్ ఎఫెక్ట్స్, Motion Capture Technology తో చిత్రీకరించారు, 
 
కేసిఆర్ గారు స్కూల్ చదివేటప్పుడు భీష్మ ద్రోణ కృపాధి దన్వి నికారచలంబు అనే కటినమైన మహా భారతం లోని పధ్యాలు పాడి బహుమతులు గెలుచుకున్న విషయం విదితమే. చాలా రోజులుగా దుబ్బాక చింతమడక, దుబ్బాక గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రస్తుత పరిస్థితులను, చూసి 60 ఏళ్ల క్రింతం ఎలా వుండేదో ఊహించుకొని, 3D ఆర్ట్స్ లో చిత్రాలు గీహించి, గ్రాఫికల్ వర్క్ నీ పూర్తి చేశారు, 
 
కెసిఆర్ గారి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, ఉద్యమాలు, వాటి ఫలితాలు, విజయాలు, ప్రస్తుత అభివ్రుది కి కారణమైన కెసిఆర్ గారి మనో గతాన్ని వివరించారు, ఇందులో 2 బిట్ సాంగ్స్ కూడా వున్నాయి.
 
కథ, స్క్రీన్ ప్లే, దర్షకత్వం :
లక్ష్మణ్ మురారి,
ఆన్లైన్ ప్రొడ్యూసర్: రమేష్ మాదాసు,
రచన సహకారం: సుధీర్ గంగాడి,
లిరిక్స్: కృష్ణ వేణి మజ్జవుల,
క్రియేటివ్ హెడ్ & ఎడిటింగ్ : మురళి రుద్ర,
CG, 3D గ్రాఫిక్స్, : రాజ్ & శశి