పెళ్లికి ఇంకా టైమ్ వుంది.. మానవత్వం ఉన్న వ్యక్తినే పెళ్లాడుతా: కీర్తి సురేష్
మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన కీర్తి సురేష్ వరుస ఛాన్స్‌లను కొట్టేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మడు 'రంగ్ దే' సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మూవీ సక్సెస్ ప్రమోషన్స్‌ను కొనసాగిస్తోంది చిత్ర బృందం. ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై స్పందించిన ఆమె.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తనకే తెలియకుండా సోషల్ మీడియాలో పలుసార్లు పెళ్లి చేశారని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకునే సమయం ఇంకా రాలేదని.. ఆ సమయం వస్తే మానవత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తిని పెళ్లాడుతానని క్లారిటీ ఇచ్చింది.
ఇకపోతే.. నితిన్ కథానాయకుడిగా నటించిన యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రంగ్‌దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్ కథానాయిక. ఇందులో నితిన్ సతీమణిగా కీర్తి నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు, కీర్తిసురేశ్ 'సర్కారువారి పాట' కోసం మహేశ్‌తో ఆడిపాడనున్నారు.