మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (11:09 IST)

అమలాపాల్‌కు బెంజ్ కారు చిక్కు.. ఛార్జీషీట్ నమోదు చేస్తారా?

సినీ నటి అమలాపాల్‌కు బెంజ్ కారు చిక్కు తప్పేలా లేదు. గతంలో పుదుచ్చేరిలో బెన్స్ ఎస్ క్లాస్ అనే రూ.1.12 కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేసి, పన్ను ఎగ్గొట్టేందుకు పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్

సినీ నటి అమలాపాల్‌కు బెంజ్ కారు చిక్కు తప్పేలా లేదు. గతంలో పుదుచ్చేరిలో బెన్స్ ఎస్ క్లాస్ అనే రూ.1.12 కోట్ల విలువ చేసే కారును కొనుగోలు చేసి, పన్ను ఎగ్గొట్టేందుకు పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఆమె మెడకు చుట్టుకుంటోంది. ఆ కారునే ఆమె కేరళలో ఉపయోగించుకుంటోంది. 
 
ఇటీవలే ఈ కేసులో న్యాయస్థానంలో అమలాపాల్ లొంగిపోయింది. తాజాగా ఈ కేసులో త్వరగా ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని తమ పోలీసులను కేరళ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. కోర్టు పన్ను చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. 
 
కానీ అమలాపాల్‌, సురేష్‌ గోపీ మాత్రం అందుకు నిరాకరించడంతో వారిపై కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ సినీ అవకాశాలతో బిజీబిజీగా వున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రంలో అమలాపాల్ నటిస్తోంది.