ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (06:34 IST)

కలెక్షన్లు కుమ్మేస్తున్న "ఖైదీ".. 5 రోజుల్లో రూ.100 కోట్లు.. రీ ఎంట్రీతోనే క్లబ్‌లో...

దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్వయంగా నిర్మ

దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుని కనకవర్షం కురిపిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రం విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్ కలుపుకుని మొత్తం ఈ చిత్రం ఏకంగా రూ.106.12 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఇందులో కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ.70 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
 
కాగా, ఈ చిత్రం తొలిరోజున బాక్సాఫీస్ వద్ద రూ.47 కోట్లు వసూలు చేసి అప్పటివరకూ ఉన్న రికార్డులన్నిటినీ కొల్లగొట్టింది. ఇందులో 'బాహుబలి' రికార్డు కూడా గల్లంతైంది. తాజాగా కేవలం ఐదు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా మరో రికార్డును అందుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బాస్‌ని చూడాలన్న తహతహలో అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సినీ థియేటర్లపై ఎగబడ్డారు. ఫలితంగా ఇప్పటికీ ఈ సెన్సేషన్స్ కొనసాగుతూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కాగా, గత 5 రోజుల్లో ఖైదీ చిత్రం సాధించిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
 
నైజాం రూ.20.35 కోట్లు
సీడెడ్ రూ.10.45 కోట్లు
ఆంధ్ర రూ.38.50 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వసూళ్లు రూ.69.30 కోట్లు
కర్నాటక రూ.12.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.2.30 కోట్లు
ఓవర్సీస్ రూ.22.12 కోట్లు
వరల్డ్‌వైడ్ గ్రాస్ మొత్తం రూ.106.12 కోట్లు