శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2023 (14:50 IST)

నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం నటించిన కిస్మత్‌ థియేటర్స్ డేట్ ఫిక్స్

Kismath poster
Kismath poster
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌ . కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
తాజాగా మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదిని అనౌన్స్ చేశారు. ‘కిస్మత్‌’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్, అవసరాల శ్రీనివాస్. రియా సుమన్ .. సర్ ప్రైజింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చూస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది.
 
రియా సుమన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజు నిర్మిస్తున్నారు. సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత.
 
ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్.
 తారాగణం: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి