సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!
హీరోయిన్ రష్మిక మందన్నా తన సొంత రాష్ట్రమైన కర్నాటకలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం స్వరాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన ఓ వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, తాను హైదరాబాద్ అమ్మాయినని చెప్పుకొచ్చింది. కర్నాటకలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. దీంతో మాతృరాష్ట్రంపై మమకారాన్ని కోల్పోయారు. ఈ వ్యాఖ్యలు కర్నాటక వాసులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆ తర్వాత ఓ ఎమ్మెల్యే రష్మికకు తగిన బుద్ధి చెబుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, రష్మికకు ఆమె సొంత కులస్థుల నుంచి మంచి సపోర్టు లభించింది.
రష్మిక మందన్నా ప్రాణాలకు ముప్పు ఉందని కొడవ కులస్థులు ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. ఆమెకు ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని కొడవ కమ్యూనిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. కర్నాటకలోని కొడవ ప్రాంతంలో కొడవ వర్గానిదే ఆధిపత్యంగా కొనసాగుతుంది. దీంతో ఈ వర్గానికి చెందిన ప్రజలు రష్మికకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు.