శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (14:44 IST)

ఆర్జీవీ సినిమా కొండా నుంచి ట్రైలర్.. వీడియో ఇదిగోండి..

Konda Movie
Konda Movie
సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని కొండా సినిమాలో తెరకెక్కించారు.
 
తాజాగా కొండా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కొండా మురళి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు? సురేఖతో ప్రేమ? సురేఖ కొండా మురళికి ఎలా సపోర్ట్ చేసింది? కొండా మురళి మీద జరిగిన హత్యాయత్నం, నక్సలైట్ల నేపథ్యం.. ఇలాంటి అంశాలన్నీ ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 23వ తేదీన విడుదల కానుంది. 
 
తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ విడుదల అయ్యింది. త్రిగన్, పృథ్వీరాజ్, ఐరా మోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా వుంది. వర్మ మార్క్ సన్నివేశాలు బాగున్నాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.