సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (14:59 IST)

ఆర్జీవీపై నో కామెంట్స్.. అభిమానిని.. కానీ ఇప్పుడు నచ్చలేదు.. యాంకర్ శ్యామల

యాంకరింగ్‌ స్కిల్స్‌తో తెలుగు టీవీ ఆడియెన్స్‌కు ఎంతో దగ్గరైంది శ్యామల. ఇటీవల డైరెక్టర్ ఆర్జీవీ శ్యామలపై కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శ్యామల కూడా ఆర్జీవీపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండులో శ్యామల సత్తా చాటింది.
 
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్యామల సెలబ్రెటీ జాబితాలోకి చేరిపోయింది. చాలా డీసెంట్ గా, గ్లామర్ గానూ బుల్లితెరపై అలరిస్తోంది శ్యామల.
 
ఇటీవల బడవ రాస్కేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గెస్ట్‌గా హాజరయ్యారు. 
 
ఈవెంట్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ యాంకర్ శ్యామలపై బోల్డ్ కామెంట్ చేశారు. ‘ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ ఇటీవల సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. ప్రస్తుతం ఆర్జీవీపై శ్యామల కామెంట్స్ చేసింది.  
 
ఇన్‌స్టా చాట్‌లో భాగంగా ఓ అభిమాని శ్యామలను ఆర్జీవీ గురించి చెప్పండి అంటూ అడిగాడు. ఇందుకు శ్యామల స్పందిస్తూ .. ‘నో కామెంట్స్‌.. కానీ ఆయన గొప్ప దర్శకుడు’ అని తెలిపింది. అంతేకాకుండా వర్మ చిత్రాలపైనా స్పందిస్తూ ‘ఒకప్పటి వర్మ చిత్రాలకు నేను పెద్ద అభిమానిని’ అంటూ.. ప్రస్తుతం ఆర్జీవీ తెరకెక్కిస్తున్న మూవీలపైనా ఇన్ డైరెక్ట్‌గా తనకు నచ్చడం లేదని పేర్కొంది.