సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:23 IST)

నేను హీరోయిన్‌తో సమానమే, ఆ విషయంలో తగ్గేదేలె అంటోన్న అనసూయ

హాట్ యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లోనిలిచింది. ఈ సారి ఏకంగా తన రెమ్యునరేషన్ గురించి చెప్పి హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు తను హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని.. వారూ తను రెండూ ఒకటేనని చెప్పింది. అందుకే తాను రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోంది అనసూయ.

 
ఇప్పుడు అనసూయ ఎందుకిలా మాట్లాడిందంటే, అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదటిరోజు పెద్దగా స్పందన లేకపోయినా ఆ తరువాత మాత్రం మంచి కలెక్షన్లను సాధించింది. ఎర్రచందనం ఆధారంగా నడిచే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. అయితే ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

 
అందులో అనసూయ నటించిన ద్రాక్షాయణి పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణే. మంగళం శ్రీను భార్యగా ఆమె క్యారెక్టర్ అందరినీ మెప్పిస్తుంది. నోట్లో వక్కాకు నములుతూ కోపంతో ఉన్న ఈ క్యారెక్టర్‌ను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అయితే ఈ సినిమాకు రెమ్యునరేషన్ గురించే ఇప్పుడు చర్చ, రచ్చ మొత్తం కూడా. తన కాల్షీట్లు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు ఇస్తాననీ, అయితే రోజుకు రెండున్నర లక్షల రూపాయలు అడిగిందట.

 
అయితే తనకు రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారనీ, సుకుమార్ అంటే గౌరవం కాబట్టి 2 లక్షలకు ఒప్పుకున్నాని అంటోందట. తను హీరోయిన్‌కు ఏ మాత్రం తగ్గను అని కూడా అంటోందట ఈ రత్తమ్మ. అందుకే వారికి ఎంత ఇస్తే నీకూ అంతే ఇస్తామని ప్రొడ్యూసర్లు చెప్పారని అంటోందట.