మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (14:45 IST)

రామ్ గోపాల్ వర్మకు ధన్యవాదాలు చెపుతామనుకున్నా.. కానీ... "శాతకర్ణి" దర్శకుడు క్రిష్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ధన్యవాదాలు చెపుదామని అనుకున్నా.. కానీ, ఇది సరైన సమయం కాదని అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదని "గౌతిమిపుత్ర శాతకర్ణి" దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించాడు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ధన్యవాదాలు చెపుదామని అనుకున్నా.. కానీ, ఇది సరైన సమయం కాదని అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదని "గౌతిమిపుత్ర శాతకర్ణి" దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించాడు. 
 
సంక్రాంతికి విడుదలైన చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు మంచి విజయాలను సాధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఎవరినోట విన్నా ఈ రెండు చిత్రాల గురించే చర్చించుకుంటున్నారు. ఇదేసమయంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన ట్వీట్లతో చర్చనీయాంశంగా మారాడు. ‘శాతకర్ణి’ని పొగుడుతూ.. ‘ఖైదీ..’ని తిడుతూ వర్మ పెడుతున్న ట్వీట్లు హాట్‌టాపిక్‌గా మారాయి.
 
‘శాతకర్ణి’ సినిమాను క్రిష్‌ అద్భుతంగా తీశాడని, బాలీవుడ్ హీరోలు అమీర్‌ ఖాన్‌, షారూక్‌ ఖాన్‌ వంటివారు క్రిష్‌ డైరెక్షన్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ట్వీట్‌ చేస్తూనే.. ‘ఖైదీ నెంబర్‌ 150’పై వర్మ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో క్రిష్‌ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘వర్మ ట్వీట్లు పెట్టడానికి కారణం మీపై ప్రేమా, ‘ఖైదీనెంబర్‌ 150’ మీదా కోపమా’ అని ప్రశ్న క్రిష్‌కు ఎదురైంది. దీనికి క్రిష్‌ స్పందిస్తూ ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగొద్దని ప్రాదేయపడ్డాడు. అలాగే తన దర్శకత్వ పనితనాన్ని ప్రశంసిస్తూ వర్మ చేసిన ఓ ట్వీట్‌కు ధన్యవాదాలు చెబుదామనుకున్నానని, కానీ, ఇది సరైన సమయం కాదని ఆగిపోయినట్టు క్రిష్ వివరణ ఇచ్చాడు.