Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న కృతిశెట్టి

Written By సెల్వి
Updated: బుధవారం, 12 అక్టోబరు 2022 (15:35 IST)
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఉప్పెన కృతిశెట్టి ప్రస్తుతం మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి. ఇదే క్రమంలో ఆమె కోలీవుడ్‌లోకి కూడా ఎంటరైంది. 
 
రామ్ హీరోగా నటించిన వారియర్ సినిమా ఆమె తొలి తమిళ సినిమా అయింది. ఆ తర్వాత అక్కడ కూడా 2 సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీపై కూడా కన్నేసింది ఈ బ్యూటీ.
 
ఓ మలయాళం సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా మల్లూవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'అజయంతే రందం మోషణం'. 
 
ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టోవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కృతి శెట్టిని తీసుకున్నారు.
 
'అజయంతే రందం మోషణం పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రం 3డిలో కూడా విడుదల కానుంది. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ , సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

అన్నీ చూడండి

తిరుమలకు చేరుకున్న ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులు

తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నా : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

యువతులతో ఏకాంత వీడియోలు... వ్యక్తి ప్రాణాలు తీశాయ్.. ఎలా?

భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అల్‌ఖైదా చీఫ్ లాడెన్ దాడులు

కృత్రిమ మేధ దూకుడుకు కళ్లెం వేయాల్సిందే : టెక్ దిగ్గజాలు

అన్నీ చూడండి

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments