శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (17:14 IST)

ఇంటి పేరు మార్చేసిన 'అందాల రాక్షసి'

lavanya - varun tej
ఇటీవల మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ఇంటిని మార్చేశారు. తెలుగు చిత్రపరిశ్రమకు "అందాల రాక్షసి" చిత్రం ద్వారా అడుగుపెట్టిన ఆమె... పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె తన ఇంటి పేరును కూడా మార్చుకుంది. ఈ జంట ఇటీవలే హనీమూన్‌ ట్రిప్‌ను కూడా పూర్తి చేసుకుని స్వదేశానికి చేరుకున్న విషయం తెల్సిందే. ఇపుడు తమ సినీ కెరీర్‌పై దృష్టిసారించారు. 
 
ఇదిలావుంటే ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో మొన్నటివరకు లావణ్య త్రిపాఠి అనే ఉండగా ఇపుడు తన పేరు కాస్త లావణ్య త్రిపాఠి కొణిదలగా మార్పు చేశారు. ఇక ఈ విషయాన్ని మెగా అభిమానులు నెట్టింట్ వైరల్ చేస్తున్నమారు. కొణిదెల ట్యాగ్‌తో లావణ్యని చూడటం ఆనందంగా ఉందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆమె కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే మార్చు చేయగా, ట్విట్టర్ ఖాతాలో మాత్రం యధావిధిగానే ఉంది.