శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (12:47 IST)

ఆ హీరోతో తొలి ముద్దు అనుభవం మరిచిపోలేను : మాజీ మిస్ ఉత్తరాఖండ్

తెలుగు చిత్రపరిశ్రమలో అచ్చతెలుగు ఆడపిల్లగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "సోగ్గాడే చిన్ననాయనా" చిత్రంలో ఇచ్చే ఆకట్టుకుంది. అయితే, ఈ భామ తొలి ముద్దుపై స్పందించింది. సినిమాల పరంగా తన తొలి మ

తెలుగు చిత్రపరిశ్రమలో అచ్చతెలుగు ఆడపిల్లగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "సోగ్గాడే చిన్ననాయనా" చిత్రంలో ఇచ్చే ఆకట్టుకుంది. అయితే, ఈ భామ తొలి ముద్దుపై స్పందించింది. సినిమాల పరంగా తన తొలి ముద్దును 'భలే భలే మగాడివోయ్' సినిమాలో నాని బుగ్గపై పెట్టిందేనని తెలిపింది.
 
దీనిపై స్పందిస్తూ, మిస్ ఉత్తరాఖండ్‌గా గెలుపొందిన తర్వాత సక్సెస్ పరిణామాలు అర్ధమయ్యాయని తెలిపింది. చాలామంది కెమెరా అనగానే భయపడతారని చెప్పింది, తాను మాత్రం అలా కాదని, కెమెరా ముందుకురాగానే తాను లావణ్య అన్న విషయం మర్చిపోతానని తెలిపింది. పాత్ర మాత్రమే గుర్తుంటుందని, డైరెక్టర్ చెప్పింది మాత్రమే తాను గుర్తుంచుకుంటానని తెలిపింది.
 
ఇంతవరకు తాను ముద్దు సన్నివేశాల్లో నటించే అవకాశం పెద్దగా రాలేదని తెలిపింది. తొలి ముద్దు మాత్రం హీరో నానికి పెట్టినట్టు చెప్పింది. అలాగే సినిమాల్లో తన తొలి డైలాగ్ 'త్వరగా నాకు పెళ్లి చేసెయ్యండి నాన్న' అన్న డైలాగ్ అని చెప్పింది. మోడలింగ్‌లో తొలిసారి ర్యాంప్ వాక్ చేసినప్పుడు 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చారని దానిని తన తల్లికి ఇచ్చేశానని తెలిపింది. తన తొలి సినిమా పారితోషికం కూడా తనతల్లికి ఇచ్చేశానని ఈ మాజీ మిస్ ఉత్తరాఖండ్ వెల్లడించింది.