ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (09:02 IST)

తొమ్మిది మంది మెగా హీరోల ఆశీర్వాదాలతో లావణ్య త్రిపాఠి

Lavnay with 9 mega heroes
Lavnay with 9 mega heroes
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్ తో అభిమానులకు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా వున్న ఫొటోను కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో నూతన వధూవరులకు జీవితకాలం ఆనందంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.. అని పవన్ కళ్యాణ్ కోట్ చేసినట్లు పోస్ట్ చేశారు.
 
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా వరుణ్ తేజ్ తో కలిపి 9మంది మెగా హీరోలు వుండడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. వారంతా లావణ్య దంపతులకు ఆశీస్సులు అందించారు. వారంతా నిలుచొని వుండగా దంపతులు కింద కూర్చుని గౌరవాన్ని చాటారు.