మణిరత్నంగారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా : ఐశ్వర్యా రాయ్
మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై సుభాస్కరన్, మణిరత్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2. గత ఏడాది విడుదలైన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని.. బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి ఇది కొనసాగింపు. చోళుల గురించి తెలియజేసే సినిమా ఇది. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 28న మీ అందరినీ థియేటర్స్‌లో కలుస్తాం. మణిరత్నంగారికి థాంక్స్. ఆయనతో ఇరువర్ నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఉంది. చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా మంది టీమ్‌తో పని చేసే అదృష్టం కలిగింది. నిర్మాత సుభాస్కరన్‌గారు అందించిన తిరుగులేని సపోర్ట్‌తో గొప్ప మ్యాజికల్ ప్రంచాన్ని క్రియేట్ చేయగలిగాం. గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసే అవకాశం కలిగింది. చాలా కష్టపడి చేశాం. ప్రతి క్షణాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు అన్నారు.