శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (15:52 IST)

"పొన్నియన్ సెల్వల్-2" నుంచి అదిరిపోయే లిరికల్ సాంగ్ రిలీజ్

ps2 movie still
మణిరత్నం తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలోని రెండో భాగం ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీన్ని పురస్కరించుకుని చిత్రం బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. చంద్రబోస్ గేయరచన చేయగా, ఏఆర్. రెహ్మాన్ సంగీత స్వరాలు సమకూర్చగా, శంకర్ మహదేవన్, చిన్నయి శ్రీపాదలు నేపథ్యగానం చేశారు. 
 
పూర్తిగా క్లాసికల్ టచ్‌తో ఆకట్టుకునేలా ఉన్న ఈ గీతంలో జయం రవితో పాటు శోభిత ధూళిపాళ్ళను చూడొచ్చు. జయం రవికి స్వాగతం పలుకుతూ శోభిత నాట్యం చేసే ఇతివృత్తంలో ఈ పాటను చిత్రీకరించారు. కాగా, ఈ మూవీలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, ప్రకాశ్ రాజ్, రహమాన్, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, పార్తిబన్, కాళిదాస్ తదితరులు నటించారు.