గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (10:20 IST)

ఆఖరి రోజుల్లో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించిన మహానటి?

మహానటి సావిత్రి గురించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా 'స్ట్రెయిట్ టాక్ విత్ తెలకపల్లి షో'లో ప్రముఖ రచయిత్రి, పాటల రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి రామలక్ష్మి సంచలన విషయాలు వెల్లడించార

మహానటి సావిత్రి గురించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా 'స్ట్రెయిట్ టాక్ విత్ తెలకపల్లి షో'లో ప్రముఖ రచయిత్రి, పాటల రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి రామలక్ష్మి సంచలన విషయాలు వెల్లడించారు. మహానటి సావిత్రి చివరి రోజుల్లో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించారని చెప్పారు. జీవిత చరమాంకంలో సావిత్రి కారు షెడ్డులో జీవించారని ఆమె తెలిపారు. 
 
ముఖ్యంగా తమిళనటుడు జెమినీ గణేషన్‌ను వివాహం చేసుకున్న సావిత్రికి విజయచాముండేశ్వరి, సతీష్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆమె చేతికి ఎముక లేదని, ఆశ్రయించిన వారిని ఆదరించడంలో సావిత్రిని మించినవారు లేరని ఆమె పేరు సంపాదించారు. అదే సమయంలో కుటుంబ సమస్యలతో తీవ్ర ఒత్తిడిలో జారుకుని, ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. 
 
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే ఏ హీరోయిన్ అయినా సావిత్రిలా పేరుతెచ్చుకోవాలని కోరుకుంటుంది. సావిత్రిని నటనకు డిక్షనరీగా చెబుతుంటారు. అలాంటి సావిత్రి జీవితంలో ఉచ్ఛ, నీచాలు చవి చూసిందనే వార్తలు ఆ మహానటి అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి.