బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2017 (13:08 IST)

నేను సావిత్రినవుతా.. సాయి పల్లవి

అలనాటి సావిత్రి. కట్టు..బొట్టుతో పాటు సంప్రదాయానికి పెట్టింది పేరు. అప్పట్లో కొంతమంది మహిళలు సావిత్రిని దేవతగా కూడా పూజించేవారు. తమిళంలో కె.ఆర్.విజయ తరువాత తెలుగులో ఆ స్థానం సావిత్రికే దక్కింది. నందమూరి తారకరామారావుతో పాటు ఎ.ఎన్.ఆర్, శోభన్ బాబు ఇలా చ

అలనాటి సావిత్రి. కట్టు..బొట్టుతో పాటు సంప్రదాయానికి పెట్టింది పేరు. అప్పట్లో కొంతమంది మహిళలు సావిత్రిని దేవతగా కూడా పూజించేవారు. తమిళంలో కె.ఆర్.విజయ తరువాత తెలుగులో ఆ స్థానం సావిత్రికే దక్కింది. నందమూరి తారకరామారావుతో పాటు ఎ.ఎన్.ఆర్, శోభన్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అగ్రహీరోలతో అప్పట్లో నటించిన సావిత్రి ఎప్పుడూ కూడా హద్దు దాటి నటించిన సంధర్భాలు లేవు.
 
తెలుగుదనానికి అచ్చమైన చిరునామా సావిత్రి. అలాంటి సావిత్రిని అనుసరిస్తానంటోంది ప్రస్తుత నటి సాయిపల్లవి. ఫిదా సినిమాతో లక్షలాదిమంది తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచుకన్న సాయి పల్లవి ఎక్కడా హద్దు మీరి నటించదట. అందులోను ముద్దు సీన్లలో అస్సలు నటించనని దర్శకులకు తెగేసి చెబుతోందట. ఇదిలా ఉంటే ఫిదా సినిమాలో కేవలం సన్నివేశం కోసమే ఒకసారి స్లీవ్ లెస్ డ్రస్ వేశాను తప్ప అస్సలు ఆ డ్రస్ వేసుకోవడం తనకు ఇష్టం లేదంటోంది సాయిపల్లవి. 
 
పరిధిని మించి ఎక్స్ పోజింగ్ చేయవద్దని, అస్సలు ఎక్స్ పోజింగ్ సినిమాలే మనకు అవసరం లేదని సాయిపల్లవి కుటుంబ సభ్యులు చెప్పారట. అందుకే సాయిపల్లవి ఏమాత్రం మొహమాటం లేకుండా ఈ విషయం గురించి దర్శకులకు ముఖం మీద చెప్పేస్తోందట. తాను సావిత్రిలాగా మంచి పేరు తెచ్చుకోవడమే తన ముందున్న లక్ష్యమంటోందట ఈ సహజ సుందరి.