శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (19:44 IST)

కృతి సనన్‌ను కూడా సుశాంత్ వాడేశాడా? నటి లిజా మాలిక్ ఏమంటోంది? (video)

బీహార్ రాష్ట్రానికి చెందిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయనకు సంబంధించి అనేక తెరవెనుక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, సుశాంత్ డ్రగ్స్ సేవించేవాడని తేలింది. అలాగే, పలువురు హీరోయిన్లతో డేటింగ్‌లో మునిగితేలినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా కృతిసనన్ పేరు కూడా వచ్చింది. సుశాంత్ - కృతి సనన్‌లు డేటింగ్‌ రిలేషన్‌లో ఉన్నారని బాలీవుడ్ నటి లిజా మాలిక్ వ్యాఖ్యానిస్తోంది. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'దాదాపు రెండేళ్ల క్రితం కృతిసనన్‌ పుట్టినరోజు వేడుకలో సుశాంత్‌ని కలిశాను. ముంబైలోని బాంద్ర క్లబ్‌లో జరిగిన ఈ పార్టీలో సుశాంత్‌ ఎంతో సంతోషంగా కనిపించాడు. ఆ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ నవ్వుతూ పలకరించాడు. కృతిసనన్‌తో పాటు సుశాంత్‌ కూడా అందరిని రిసీవ్‌ చేసుకుంటూ డ్రింక్స్‌ అందిస్తూ.. డ్యాన్స్‌ చేస్తూ ఆనందంగా వున్నాడు. ఆరోజు కృతి - సుశాంత్‌ ముఖాల్లో కొత్త వెలుగు కనిపించింది. వాళ్లిద్దరిని అలా చూస్తే రిలేషన్‌లో వున్నారని నాకు అనిపించింది. ఈ ఇద్దరు డేటింగ్‌లో వున్నారని పలు మాధ్యమాల్లో వచ్చినప్పటికీ ఎన్నోసార్లు ఇద్దరు కలిసి బయటికి వచ్చేవారు' అని లిజా గుర్తు చేశారు.