సుశాంత్‌కు డ్రగ్స్ ముట్టుకోడు.. సారా ఆ ట్రిప్ తర్వాత దూరం.. కారులో వున్నంతసేపూ..?

Sushant Singh Rajput
Sushant Singh Rajput
సెల్వి| Last Updated: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:03 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ తీసుకునేవాడని.. అతని కోసమే డ్రగ్స్ కొనిపెట్టే దాన్ని అంటూ నటి, ప్రియురాలు రియా చక్రవర్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ డ్రగ్స్‌ తీసుకోవడం తాను ఎన్నడూ చూడలేదని సదరు హీరో పాత డ్రైవర్‌ ధీరేంద్ర యాదవ్‌ తెలిపారు. సుశాంత్‌ అనుమానస్పద మృతి కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్న విషయం తెలిసిందే.

ధీరేంద్ర సుశాంత్‌ దగ్గర కొంతకాలంపాటు పనిచేసిన కారు డ్రైవర్‌ ధీరేంద్ర యాదవ్‌ను ఇటీవల సీబీఐ విచారించింది. డ్రగ్స్‌, రియా చక్రవర్తి గురించి అడిగి తెలుసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ధీరేంద్ర మాట్లాడుతూ.. సుశాంత్‌ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. '2018 అక్టోబర్‌ నుంచి 2019 ఏప్రిల్‌ వరకూ సుశాంత్‌ కారు డ్రైవర్‌గా పనిచేశానని చెప్పాడు.

సుశాంత్‌ దగ్గర పనిలో చేరిన కొత్తలో ఆయన కథానాయకుడిగా నటించిన 'కేదార్‌నాథ్‌' చిత్రం విడుదలయ్యింది. 'డ్రైవ్‌', 'చిచ్చోరే' సినిమా షూటింగ్స్‌ జరుగుతున్న సమయంలో తాను ఆయన దగ్గరే పని చేశానని క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్స్‌కి అనుగుణంగా ఏ సమయానికి ఎక్కడికి వెళ్లాలనే విషయాన్ని ఒకరోజు ముందు సుశాంత్‌ మేనేజర్‌ చెప్పేవారు. ప్రతిరోజూ జిమ్‌, స్విమ్మింగ్‌ కోసం వాటర్‌స్టోన్‌ రిసార్ట్‌, అలాగే సినిమా ప్రమోషన్స్‌కి తీసుకువెళ్లేవాడినని తెలిపాడు.

కారులో ఉన్నంతసేపూ ఆయన మ్యూజిక్‌ వినడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అప్పుడప్పుడు తన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. తాను డ్రైవర్‌గా పనిచేసిన ఆరు నెలల్లో ఆయన కారులో డ్రగ్స్‌ తీసుకోవడం ఎప్పుడూ చూడలేదు. అప్పుడప్పుడు భోజనం చేయడం కోసం సుశాంత్‌ ఇంటిలోపలికి వెళ్లేవాడిని అలా వెళ్లినప్పుడు కూడా ఆయన డ్రగ్స్‌ తీసుకోవడం గమనించలేదని వెల్లడించాడు.

అలాగే ఆయన మానసిక కుంగుబాటులో ఉన్నట్లు ఏ రోజు కనిపించలేదు. నిజం చెబుతున్నా.. ఆయన డ్రగ్స్‌ తీసుకోవడం తానెప్పుడూ చూడలేదని డ్రైవర్ తెలిపాడు. సుశాంత్‌కి ప్రాణస్నేహితులంటూ ఎవరూ లేరు. ఆయన ఇంటికి స్నేహితులు ఎవరూ రావు. తాను పనిచేసినప్పుడు కుశాల్‌ జవేరీ అక్కడ మేనేజర్‌, సిద్దార్థ్‌ గుప్తా సుశాంత్‌తో కలిసి అదే ఇంట్లో ఉండేవాడు.

అప్పట్లో సుశాంత్‌ అక్క ప్రియాంక, ఆమె భర్త సిద్దార్థ్‌ కొన్నిరోజులు ఇక్కడ ఉండి వెళ్లారని అని ధీరేంద్ర వివరించారు. సుశాంత్‌తో పాటు షూటింగ్‌లు లేనప్పుడు టెన్నిస్ ఆడేవాళ్లం. అందరికీ సరైన షెడ్యూల్ ఉంది. మేము షూటింగ్ కోసం వెళ్లి టెన్నిస్ కూడా ఆడేవాళ్ళం.. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలు కూడా ఆడేవాళ్లమని చెప్పుకొచ్చాడు. సుశాంత్ తన కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని, నటి సుశాంత్ జీవితంలోకి ప్రవేశించే ముందు తాను ఉద్యోగం నుంచి తప్పుకున్నప్పటి నుంచి తాను ఎప్పుడూ రియా చక్రవర్తిని కలవలేదని ధీరేంద్ర తెలిపారు.

ఇంకా సారా, సుశాంత్ సంబంధంపై కూడా ధీరేంద్ర వెల్లడించాడు. సారా, సుశాంత్ మంచి స్నేహితులు అయినప్పటికీ, థాయ్‌లాండ్ పర్యటన తర్వాత ఆమె అతని జీవితంలో లేదని చెప్పుకొచ్చాడు "ట్రిప్ తరువాత 10 రోజుల తరువాత ఉండవచ్చు. అప్పటికి సోంచిరియా విడుదల అయ్యింది. నేను సెలవులో ఉన్నాను" అని డ్రైవర్ చెప్పాడు.దీనిపై మరింత చదవండి :