బైకులా జైల్లే చంపేస్తారు.. బెయిలివ్వండి.. రియా చక్రవర్తి

Rhea Chakraborty
ఠాగూర్| Last Updated: గురువారం, 10 సెప్టెంబరు 2020 (08:53 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. సుశాంత్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసేందుకు బాలీవుడ్ నటి, సుశాంత్ ప్రియురాలు ఏకంగా డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుంది. ఈ విషయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో బట్టబయలైంది. దీంతో ఆమెను ఎన్.సి.బి అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను ముంబైలోని బైకులా జైలుకు తరలించారు.

అయితే, ఈ జైలులో తన ప్రాణాలకు ముప్పువుందని పేర్కొంటూ బెయిల్‌కు దరఖాస్తు చేశారు. దీన్ని విచారించిన మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. దాంతో ఆమె బుధవారమమే తన న్యాయవాది ద్వారా ఎన్డీపీఎస్ న్యాయస్థానంలో తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

రియా వైపు బెయిల్ ఇవ్వదగిన కారణాలు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది సతీశ్ మానే షిండే పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన రియా సోదరుడు షోవిక్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.దీనిపై మరింత చదవండి :