బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: గురువారం, 30 ఆగస్టు 2018 (17:34 IST)

చూశావా తెలుగు బిగ్ బాస్‌... మలయాళం బిగ్ బాస్ ఎంత పని చేశాడో?

బిగ్‌బాస్ రియాలిటీ షో, దీని క్యాప్షన్ ఎప్పుడైనా, ఏదైనా జరగచ్చు. ఇందుకు తగ్గట్లుగానే ఎన్నో రకాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గొడవలు, స్నేహాలు, ప్రేమలు ఇవన్నీ కామనే. కానీ మొదటిసారిగా ఒక జంట బిగ్ బాస్ హౌస్‌లోనే ప్రేమించుకుని, పెళ్లి కూడా చేసుకోనున్నామని క

బిగ్‌బాస్ రియాలిటీ షో, దీని క్యాప్షన్ ఎప్పుడైనా, ఏదైనా జరగచ్చు. ఇందుకు తగ్గట్లుగానే ఎన్నో రకాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గొడవలు, స్నేహాలు, ప్రేమలు ఇవన్నీ కామనే. కానీ మొదటిసారిగా ఒక జంట బిగ్ బాస్ హౌస్‌లోనే ప్రేమించుకుని, పెళ్లి కూడా చేసుకోనున్నామని కెమెరాల సాక్షిగా అనౌన్స్ చేసారు.
 
మలయాళం బిగ్ బాస్‌లో ఇంటి సభ్యులు శ్రీనియాస్ అరవింద్, పర్లే మన్నె కంటెస్టెంట్‌లుగా వచ్చారు. హౌస్‌లో ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చినందు వలన కొంతకాలం సన్నిహితంగా మెలిగారు. తమ మధ్య స్నేహానికి మించి ఏదో ఉందని తెలుసుకున్న ఇరువురూ పరస్పరం తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. ఇద్దరికీ సమ్మతం కావడంతో వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ హౌస్‌లోని కెమెరా వద్దకు వచ్చి చెప్పి, తమ పెళ్లికి ఒప్పుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులకు విన్నవించుకున్నారు.
 
మలయాళం బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మోహన్‌లాల్ శ్రీనియాస్ అరవింద్, పర్లే మన్నె ప్రేమను గౌరవించి పెళ్లికి తన ఆమోదం తెలిపాడు. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి తానే స్వయంగా పెళ్లి జరిపిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? ప్రేమ పక్షులు బయటికెళ్లాక కూడా ఇదే నిర్ణయంపై ఉంటారా అనేది వేచి చూడాల్సిందే.