మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (16:38 IST)

బుల్లితెరపై మహానటి రికార్డ్..

''మహానటి'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, జాగర్ల మూడి రాధాకృష

''మహానటి'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, జాగర్ల మూడి రాధాకృష్ణ, ప్రకాశ్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ అందించాడు. వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌ పై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్ నిర్మాణంలో ఈ మూవీ రూపొందింది.
 
అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక, కలెక్షన్ల వర్షం కురిపించింది. సావిత్రగా కీర్తి సురేష్ క్యారెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీతో కీర్తి సురేష్ కీర్తి అమాంతం పెరిగింది. సినిమా రిలీజ్ అయినప్పట్నుంచే బాక్సాపీస్ దగ్గర రికార్డులు సృష్టించిన మహానటి, బుల్లితెరపై కూడా రికార్డు సృష్టించింది. 
 
ఆగస్టు 19వ తేదీన ఈ సినిమా టీవీలో ప్రసారం అయ్యింది. దీంతో బుల్లితెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది. మ‌హాన‌టి మూవీ 20.16 పాయింట్లు సాధించింది. బాహుబ‌లి2 త‌ర్వాత అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాల జాబితాలో మహానటి స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది మహానటి సినిమా యూనిట్. 
 
ఇక టీఆర్పీ రేటింగ్‌లో బాహుబలి, మగధీర, డీజే, ఫిదా, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలున్నాయి.  వీటి తర్వాత లేడీ ఓరియంటేడ్ విభాగంలో హిట్ కొట్టిన సినిమాగా మహానటి రికార్డు క్రియేట్ చేయడం విశేషం.