బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (17:02 IST)

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు రంగస్థలం, మహానటి

అలనాటి నటి సావిత్రి జీవితచరిత్ర 'మహానటి'గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్, సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేశారు. తె

అలనాటి నటి సావిత్రి జీవితచరిత్ర 'మహానటి'గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్, సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌‍లోను ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం ఆ సినిమా ''ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ మెల్‌బోర్న్‌''కు నామినేట్ అయింది. 
 
కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమా, ఉత్తమచిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీపడుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మహానటి సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు నామినేట్ కావడంపై హర్షం వ్యక్తం చేశాడు. 
 
'మహానటి' విదేశాల్లోను ఆదరణ పొందుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. ఉత్తమనటి కేటగిరీలో దీపికా పదుకొనే (పద్మావత్), అలియా భట్ (రాజీ), రాణీముఖర్జీ (హిచ్‌కీ), విద్యాబాలన్ (తుమ్హారీ సులు)తో కీర్తి సురేశ్ పోటీపడనున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 10 నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. అలాగే రంగస్థలం కూడా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ మెల్‌బోర్న్ 2018కి ఎంపికైంది. వేసవి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక మహానటిలో ఉత్తమ నటి అవార్డుకు కీర్తి సురేష్, రంగస్థలంలో సమంతకు ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ అయ్యారు.