మధుప్రియ ప్రేమ వివాహానికి అడ్డుతగిలిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు!
కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణానికి వర్ధమాన గాయని మధుప్రియ ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, మధుప్రియ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్‌లో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే గురువారం అర్థరాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాహనాల్లో వచ్చి మధుప్రియను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ప్రియుడి తరపు బంధువులు ఫిర్యాదు చేయడంతో కాగజ్‌నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేమజంటను కాగజ్‌నగర్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో కాగజ్‌నగర్ రూరల్ సీఐ రమేష్ బాబు, టౌన్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మధుప్రియ, శ్రీకాంత్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.