బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (10:24 IST)

''కాలా''కు సినిమాతో రజనీకాంత్, ధనుష్‌కు కొత్త చిక్కు

''కాలా'' సినిమా కథ, టైటిల్ కాపీ అంటూ ఓ సహాయ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్, నిర్మాత, దర్శకుడు ఫిబ్రవరి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. వివర

''కాలా'' సినిమా కథ, టైటిల్ కాపీ అంటూ ఓ సహాయ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్, నిర్మాత, దర్శకుడు ఫిబ్రవరి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. సినిమా టైటిల్‌తో పాటు కథ తనదేనంటూ సహాయ దర్శకుడు రాజశేఖరన్ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు విచారించింది.
 
'కాలా కరికాలన్' అనే కథను పదేళ్ల క్రితం తాను రాసుకున్నానని, అందులో రజనీకాంత్‌ను హీరోగా తీసుకోవాలని భావించానని.. పిటిషనర్ వాదనను న్యాయస్థానం విన్నది. ఈ క్రమంలో 'కాలా' పాత్రధారి రజనీకాంత్, నిర్మాత ధనుష్‌, దర్శకుడు పా రంజిత్‌, దక్షిణ చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘంకు నోటీసులు పంపింది. 
 
కాగా, ''కాలా'' సినిమాపై 2017 అక్టోబర్‌లో చెన్నై కోర్టును రాజశేఖరన్ ఆశ్రయించగా, అక్కడ విచారణ సందర్భంగా తమ సినిమా కథ పా రంజిత్‌ రాసినదని, పిటిషనర్ కథతో సంబంధం లేదని ధనుష్‌ ప్రొడక్షన్‌ సంస్థ వండర్‌ బార్‌ ఫిల్మ్స్‌ వివరణ ఇచ్చింది. 
 
ఆపై ఈ పిటిషన్‌ను హైకోర్టుకు తీసుకెళ్లమని సూచించడంతో పిటిషనర్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, దానిని స్వీకరించిన న్యాయస్థానం రజనీ, నిర్మాత, దర్శకుడ్ని ఫిబ్రవరి 12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.